News April 25, 2024

VZM: అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగి మృతి

image

జామి మండలం కిర్ల గ్రామానికి దండి నాగరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాగరాజు అట్టాడ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా కనబడటం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం అలమండ హైవే వద్ద బ్రిడ్జ్ సమీపంలో స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 18, 2026

VZM: ‘బీఎల్ఏలను త్వ‌ర‌గా నియ‌మించాలి’

image

రాజ‌కీయ పార్టీలు ప్ర‌తీ పోలింగ్ కేంద్రానికి త‌మ ప్ర‌తినిధులుగా బీఎల్‌ఏల‌ను నియ‌మించి, ఆ జాబితాను త్వ‌ర‌గా అంద‌జేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.స‌త్తిబాబు కోరారు. త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో శనివారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. బీఎల్ఎల‌ను నియ‌మించుకోవ‌డం ద్వారా ఎన్నిక‌ల ప్ర‌క్రియను స‌జావుగా, పార‌ద‌ర్శ‌కంగా పూర్తి చేసేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు.

News April 18, 2026

VZM: పైడితల్లమ్మ ఆలయం పనులు.. ఉత్తరాయణలోనే ప్రారంభించేలా చర్యలు

image

విజయనగరం పైడితల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. దేవాలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్ వ్యవస్థ మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాయణ కాలంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 18, 2026

VZM: మే 5, 6,7 తేదీల్లో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు

image

రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీల (5వ ఏపీ కప్) పోస్టర్‌ను గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు దంపతులు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు శనివారం అశోక్ బంగ్లాలో ఆవిష్కరించారు. మే 5, 6,7 తేదీల్లో విజయనగరం రాజీవ్ స్టేడీయంలో ఈ పోటీలు జరగనున్నట్లు జిల్లా ఒలింపిక్, తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి, ఎమ్మెల్సీ గ్రీష్మ పాల్గొన్నారు.