News December 10, 2024
VZM: ‘ఆ కేసుల్లో రాజీ కుదర్చండి’
డిసెంబర్ 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎ అదాలత్‌లో పలు కేసుల్లో ఇరు వర్గాలకు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రాజేశ్ కుమార్ సూచించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల న్యాయమూర్తులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కు బౌన్స్, తదితర కేసులను ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేయాలన్నారు.
Similar News
News January 14, 2025
పార్వతీపురం: కండల వీరుడు కోడి రామ్మూర్తి నాయుడు వర్ధంతి
కండల వీరుడు కోడి రామ్మూర్తి నాయుడు 1883 నవంబర్ 3న వీరఘట్టంలో జన్మించారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో విజయనగరంలోని తన చిన్నాన్న దగ్గర పెరిగాడు. చిన్నప్పటి నుంచి వ్యాయామాల పై ఆసక్తి ఉన్న ఆయన 20 ఏళ్లకే గుండెలపై 1 1/2 టన్ను బరువు మోసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విజయనగరంలో సర్కాస్ కంపెనీ స్టార్ట్ చేసిన ఆయన గుండెలపై ఏనుగు ఎక్కించుకొని అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందారు. 1942 జనవరి 14న తుది శ్వాస విడిచారు.
News January 14, 2025
ఎల్.కోట: చెరువులో పడి వ్యక్తి మృతి
ఎల్.కోట మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. మల్లివీడుకు చెందిన వీరనాగా పాత్రుడు చెరువులో పడి మృతిచెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. సాయత్రం బహిర్భూమికి వెళ్లిన పాత్రుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
News January 13, 2025
గుమ్మలక్ష్మీపురం: బాలిక ఆత్మహత్య
గుమ్మలక్ష్మీపురం మండలం జర్న గ్రామానికి చెందిన జీలకర్ర స్వాతి అనే బాలిక (16) ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వేకువజామున జరిగింది. గతంలో బొబ్బిలిలో బాలిక పై లైంగిక దాడి జరిగిందని పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమెండ్‌కు తరలించారు. ఎల్విన్ పేట ఎస్సై శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.