News November 8, 2025

VZM: ఈనెల 12న YSRCP ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టామని ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. గత 17 నెలల్లో ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, మెడికల్ కాలేజీకి మాత్రం నిధులు కేటాయించలేకపోతోందని ప్రశ్నించారు.

Similar News

News January 17, 2026

VZM: పండగకి ఇంత తాగేశారా..!

image

విజయనగరం జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో మందుబాబులు వైన్ షాపులు, బార్లకు క్యూ కట్టారు. ఏకంగా రూ.13.81 కోట్ల మద్యాన్ని ఫుల్‌గా తాగేశారు. జిల్లాలో 225 మద్యం షాపులు, 26 బార్లు ఉన్నాయి. ఈనెల 13,14 తేదీల్లో 52,090 కేసుల ఐఎంఎల్ మద్యం, 16న 485 బీర్ కేసుల విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

News January 17, 2026

విజయనగరం జిల్లా మీదుగా అమృత్ భారత్ స్లీపర్ ట్రైన్..రేపట్నుంచే

image

రైలు ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. (02609) ట్రైన్ న్యూజల్ పాయ్ గురి నుంచి విజయనగరం మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్‌పాయ్‌గురిలో 1:45ని.లకు బయలదేరి విజయనగరానికి 1:25లకు చేరుకుంటుంది.