News August 28, 2024
VZM: ఈవీఎం రీవెరిఫికేషన్‌కు ఎంత కట్టారంటే?

ఈవీఎంల చెకింగ్, రీవెరిఫికేషన్‌కు నిబంధనల ప్రకారం నగదు చెల్లించారని విజయనగరం కలెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. గజపతినగరం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం నెం.20లో రీవెరిఫికేషన్‌కు బొత్స అప్పల నరసయ్య, నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో నెం.9పోలింగ్ కేంద్రంలో EVM చెకింగ్, రీవెరిఫికేషన్‌కు బెల్లాన చంద్రశేఖర్ దరఖాస్తు చేశారు. ఈకమ్రంలో ఇద్దరూ కలిపి రూ.47,200 చెల్లించారని కలెక్టర్ చెప్పారు.
Similar News
News January 23, 2026
VZM: ఐటీఐ & డిప్లొమా యువతకు రష్యాలో ఉద్యోగాలు

ఐటీఐ & డిప్లొమా అర్హత కలిగిన యువతకు రష్యాలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఎంపికైన వారికి నెలకు 60,000 రూబిల్స్ జీతం, 10,000 భత్యం, ఉచిత వసతి, టికెట్లు, బీమా సదుపాయాలు కల్పిస్తారన్నారు. 20 ఏళ్లు పైబడిన వారు naipunyam.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 23, 2026
VZM: 27న జాబ్ మేళా.. నెలకు రూ.30,000 వరకు జీతం

విజయనగరంలోని మహారాజా కళాశాల ఆవరణలో ఈనెల 27న ఉదయం 10 గంటల నుంచి భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. నాలుగు సంస్థల ద్వారా 595 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత ఉన్న యువతీ, యువకులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.14,765 నుంచి రూ.30,000 వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు employment.ap.gov.in, ncs.gov.inలో నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు.
News January 23, 2026
ఉపాధి హామీ కింద 100 రోజుల పని తప్పనిసరి: VZM కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద ప్రతి వేతనదారునికి 100 రోజుల పని తప్పనిసరిగా కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పనులు, కుటుంబ సర్వే, అక్షరాంధ్ర కార్యక్రమాలపై మండల వారీగా సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గృహ సర్వే ఫిబ్రవరి 10లోపు శతశాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.


