News March 31, 2024
VZM: ‘ఏప్రిల్ 14లోగా ఓటుకోసం ధరఖాస్తు చేసుకోవాలి’

18 సంవత్సరాలు నిండినవారంతా ఏప్రిల్ 14వ తేదీలోగా ఓటుకోసం ధరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వాటిని పరిశీలించి 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. వీరికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో కొత్తగా ఓటేసే అవకాశం లభిస్తుందని, అర్హత ఉన్నవారంతా ఓటు హక్కు పొందడమే కాకుండా, ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News February 16, 2026
లోకల్ హాలిడే ఉన్నా పరీక్ష తప్పనిసరి: డీఈవో

విజయనగరం జిల్లాలోని అన్ని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు డీఈవో మాణిక్యాలనాయుడు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే 10వ తరగతి ప్రీఫైనల్ బయాలజీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని తెలిపారు. లోకల్ హాలిడే ఉన్నా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఇది ఇలా ఉండగా మిగతా క్లాసులకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించాయి. మరి మీ స్కూల్‌కు సెలవు ఇచ్చారా..
News February 15, 2026
VZM: సుమారు 1000 మందితో భద్రత ఏర్పాట్లు

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శివాలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. రామతీర్థం, పుణ్యగిరి, సంగం దేవాలయాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సుమారు 1000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. బందోబస్తులో నలుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 160 మంది ఎఎస్ఐలు, హెచ్సీలు విధులు నిర్వర్తిస్తారన్నారు.