News March 31, 2024

VZM: కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కేంద్రీయ విద్యాలయం (బాబామెట్ట)లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 15న సాయంత్రం వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఒకటో తరగతిలో 32 సీట్లకు విద్యాహక్కు చట్టం ప్రకారం ఎనిమిది రిజర్వు చేసినట్లు తెలిపారు. రెండు, ఆపై తరగతులకు ఖాళీల మేరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

Similar News

News February 16, 2026

విజయనగరం కలెక్టరేట్‌కు 259 వినతులు

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 259 వినతులు అందాయి. వీటిలో 166 పీజీఆర్ఎస్‌కు, 93 రెవెన్యూ క్లినిక్‌కు వచ్చాయి. డీఆర్ఓ మురళి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, కళావతి, నూకరాజు, బి. శాంతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News February 16, 2026

VZM: ‘జిల్లా ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి’

image

​విజయనగరం జిల్లాలోని సాగు, త్రాగునీటి ప్రాజెక్టులను, కాలువలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కులాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో అధికారులకు వినతిని ఇచ్చారు. ​ఈ సందర్భంగా నాయకులు ఆదినారాయణ, రామారావు మాట్లాడుతూ..జిల్లాలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని, సాగునీరు ప్రాజెక్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.

News February 16, 2026

లోకల్ హాలిడే ఉన్నా పరీక్ష తప్పనిసరి: డీఈవో

image

విజయనగరం జిల్లాలోని అన్ని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు డీఈవో మాణిక్యాలనాయుడు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే 10వ తరగతి ప్రీఫైనల్ బయాలజీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని తెలిపారు. లోకల్ హాలిడే ఉన్నా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఇది ఇలా ఉండగా మిగతా క్లాసులకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించాయి. మరి మీ స్కూల్‌కు సెలవు ఇచ్చారా..