News March 26, 2024
VZM: ‘కోడ్‌కి ముందున్న శిలాఫలకాలకు కోడ్ వర్తించదు’

ఎన్నికల కోడ్ అమలులోకి రాక ముందు లబ్ధిదారుల వద్ద నున్న పాస్ పుస్తకాల పైన లేదా ఏ ఇతర లబ్ధిదారు కార్డుల పైన ఉన్న ప్రభుత్వ లోగోలు, ముఖ్యమంత్రి ఫోటోలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి రావని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. కోడ్ రాక ముందు వేసిన శిలా ఫలకాలు, సర్వే రాళ్లకు కూడా కోడ్ వర్తించదని తెలిపారు. మోడల్ కోడ్ అమలు అదికారులు కోడ్‌లోని అంశాలను క్షున్నంగా చదవాలని తెలిపారు.
Similar News
News February 13, 2026
రేపు విజయనగరం జిల్లాలో పాఠశాలలకు సెలవు లేదు: DEO

విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయనున్నాయని DEO మాణిక్యం నాయుడు శుక్రవారం తెలిపారు. వాస్తవానికి రేపు రెండో శనివారం అయినప్పటికీ గత ఏడాది తుఫాన్ సందర్భంగా సెలవుల అనంతరం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు పాఠశాలలకు పనిదినాలు ఉండనున్నాయని అన్నారు. పాఠశాలల పనిదినాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రేపు సెలవు రద్దు చేయడం జరిగిందన్నారు.
News February 13, 2026
VZM: ‘ఆ సర్టిఫికేట్ అందించకపోతే పెన్షన్ కట్’

రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్, కుటుంబ పెన్షన్ దారులు తమ పెన్షన్ నిరంతరాయంగా పొందేందుకు నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ అందించాలని జిల్లా ట్రైజరీ అధికారి వి.నాగ మహేశ్ శుక్రవారం తెలిపారు. ఈ 28వ తేదీలోపు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను ఇవ్వల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో Jeevan Pramaan యాప్ ద్వారా ఇంటి నుంచే జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చునని పేర్కొన్నారు.
News February 13, 2026
గంట్యాడ: పచ్చకామెర్లతో యువకుడి మృతి

గంట్యాడ మండలం కొండ తామరాపల్లి గ్రామానికి చెందిన యువకుడు పచ్చకామెర్లతో మృతి చెందాడు. కోన పవన్ కుమార్ (22) జ్వరం, పచ్చకామెర్లు రావడంతో 5 రోజుల క్రితం విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. పవన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉన్న పవన్ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు.


