News November 19, 2025

VZM: జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్‌కు జిల్లా విద్యార్థులు

image

జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్‌కు విజయనగరం జిల్లాలోని ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించడంతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జరగనున్న జాతీయ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొంటారు. వీరిని అసోసియేషన్ ప్రతినిధులు అయ్యలు, వేణుగోపాల్ రావు బుధవారం అభినందించారు.

Similar News

News January 19, 2026

పంచాయతీలకు 8 ఈ-ఆటోల పంపిణీ

image

పుట్టపర్తిలోని జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం డీపీఓ సమత 8 ఈ-ఆటోలకు పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని గ్రామాల్లో పరిశుభ్రతను పెంచేందుకు వీటిని పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకల్లు, రోళ్ళ, ఎన్‌పీ కుంట, మడకశిర, తలుపుల, గాండ్లపెంట, పరిగి, నల్లచెరువు మండలాల పంచాయతీలకు వీటిని కేటాయించారు. చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.

News January 19, 2026

21న జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ సమావేశం: కలెక్టర్

image

జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఈనెల 21న జరగనుందని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం తెలిపారు. ఛైర్‌పర్సన్ డాక్టర్ గుమ్మ తనూజరాణి అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి జరగనున్న ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు హాజరుకావాలని కోరారు. అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలన్నారు.

News January 19, 2026

ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

image

AP: 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 94% నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక నుంచి ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరోవైపు నేతన్నలకు మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ కింద రూ.1.67కోట్లు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు.