News November 19, 2025

VZM: జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్‌కు జిల్లా విద్యార్థులు

image

జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్‌కు విజయనగరం జిల్లాలోని ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించడంతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జరగనున్న జాతీయ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొంటారు. వీరిని అసోసియేషన్ ప్రతినిధులు అయ్యలు, వేణుగోపాల్ రావు బుధవారం అభినందించారు.

Similar News

News January 18, 2026

జగిత్యాల: ‘అభివృద్ధి కోసం సీఎం‌ను కలిస్తే రాజకీయ దాడులా?’

image

JGTLలో నిర్వహించిన మీడియా సమావేశంలో MLA సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. JGTL అభివృద్ధి కోసం CMను కలిసినందుకు తనపై అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. హింసాత్మక రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజలు అభివృద్ధినే కోరుకుంటారన్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా JGTLను అభివృద్ధి చేసి తీరుతామన్నారు.

News January 18, 2026

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

image

అత్యధిక వేదికల్లో సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పారు. 35 వేదికల్లో శతకాలు నమోదు చేసి సచిన్(34) రికార్డును బ్రేక్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్(26), పాంటింగ్(21) ఉన్నారు. మరోవైపు NZపై అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ రికార్డులకెక్కారు. కోహ్లీ(10) తర్వాతి స్థానాల్లో కలిస్(9), రూట్(9), సచిన్(9), పాంటింగ్(8), సెహ్వాగ్(8) ఉన్నారు.

News January 18, 2026

విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ: ఎస్‌ఈ రాజేశ్వరి

image

2026-27 ఆర్థిక సంవత్సర విద్యుత్ టారిఫ్‌పై ఈ నెల 20 నుంచి 27 వరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు APEPDCL ఎస్‌ఈ రాజేశ్వరి ఆదివారం తెలిపారు. డిస్కంలు సమర్పించిన చార్జీల ప్రతిపాదనలపై ప్రజలు తమ అభిప్రాయాలను అమలాపురం ఎస్‌ఈ కార్యాలయంలో ఆన్ లైన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.