News November 19, 2025
VZM: జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్‌కు జిల్లా విద్యార్థులు

జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్‌కు విజయనగరం జిల్లాలోని ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించడంతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జరగనున్న జాతీయ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొంటారు. వీరిని అసోసియేషన్ ప్రతినిధులు అయ్యలు, వేణుగోపాల్ రావు బుధవారం అభినందించారు.
Similar News
News January 22, 2026
పెద్దపల్లి: దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తుల ఆహ్వానం

అర్హులైన దివ్యాంగులు ఉచిత సహాయక ఉపకరణాల కోసం ఈనెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో బ్యాటరీ వీల్‌చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేయనుందని తెలిపారు. తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఈ పథకం అమలవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు గడువులోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
News January 22, 2026
రుయాలో AI సేవలు ప్రారంభం

రోగులకు రియల్ టైమ్‌లో వేగంగా, అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం రుయాలో AI ఆధారిత ‘నెక్స్ట్ జెన్’ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసింది. ఓపీ, ఐపీ, సర్జరీ, ల్యాబ్, రేడియాలజీ, ఐసీయూ, ఫార్మసీ విభాగాలతో ఈ సాంకేతికత అనుసంధానమై పనిచేస్తుంది. ఇకపై ప్రతి రోగికి ప్రత్యేక ఐడీ క్రియేట్ చేసి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌తో అనుసంధానం చేయడం ద్వారా జీవితకాల ఆరోగ్య వివరాలు డిజిటల్‌గా భద్రపరచనున్నారు.
News January 22, 2026
వైద్య రంగంలో సరికొత్త విప్లవం..!

ఐఐటీ బాంబే & IIT మండి శాస్త్రవేత్తలు చిన్న రోబోల సహాయంతో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కనిపెట్టారు. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నీటిలోకి వెళ్లి, ఒకేసారి దిశ మార్చుకుంటూ ఎలా ఈదుతాయో ఈ రోబోల ద్వారా విజయవంతంగా గుర్తించారు. జీవుల ప్రాథమిక కదలికలను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నానో రోబోలు మానవ రక్తనాళాల్లోకి వెళ్లి వ్యాధి ఉన్న చోటే మందులు అందించేలా ప్రయోగాలు చేయనున్నారు.


