News November 19, 2025
VZM: జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్‌కు జిల్లా విద్యార్థులు

జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్‌కు విజయనగరం జిల్లాలోని ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించడంతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జరగనున్న జాతీయ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొంటారు. వీరిని అసోసియేషన్ ప్రతినిధులు అయ్యలు, వేణుగోపాల్ రావు బుధవారం అభినందించారు.
Similar News
News January 19, 2026
విశాఖ: ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ రాలేదు!

ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ 10 గంటలకు ప్రారంభమైనా ఫిర్యాదుదారులు కనిపించలేదు. మరోవైపు అధికారులు కూడా సగానికి పైగా లేకపోవడం విశేషం. అన్ని సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో వచ్చిన వారు విస్తుపోతున్నారు. పండగ ఎఫెక్ట్ కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని పలువురు భావిస్తున్నారు.
News January 19, 2026
మాస్టర్‌చెఫ్ ఇండియాలో మెరిసిన ‘HYD ఫైర్ పాన్ వాలా’

భాగ్యనగరపు అద్భుతమైన ఆహార వైభవం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తన విభిన్నమైన శైలితో HYD వీధుల్లో ‘ఫైర్ పాన్ వాలా’గా గుర్తింపు పొందిన హుస్సేన్, ప్రముఖ కుకింగ్ రియాలిటీ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 9’లో అడుగుపెట్టారు. వేల రకాల పాన్‌లను తయారు చేయడంలో రికార్డు సృష్టించిన హుస్సేన్, వీల్‌చైర్‌కే పరిమితమైనా తన ఆత్మవిశ్వాసంతో మాస్టర్‌చెఫ్ వేదికపై జడ్జీలను ఆశ్చర్యపరిచారు.
News January 19, 2026
INC అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్: బండి

TG: సీఎం రేవంత్ <<18890595>>వ్యాఖ్యలకు<<>> కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. INC ఇప్పుడు ఇటలీ నేషనల్ కాంగ్రెస్‌గా మారిందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలన్న గాంధీ విష్‌ను ఆ పార్టీ నెరవేర్చలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 70 ఏళ్ల కాంగ్రెస్ బానిసత్వ ఆలోచనలను తొలగిస్తున్నామన్నారు. సీఎం స్కిల్స్ యూనివర్సిటీలో పాలిటిక్స్ కోర్సును చేర్చి విద్యార్థిగా చేరాలని చురకలు అంటించారు.


