News September 1, 2024

VZM: తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..

image

జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌న్న వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు మేర‌కు జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఈ నేప‌థ్యంలో కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేశారు. క‌లెక్ట‌రేట్ కంట్రోల్ రూమ్ 08922 236947, విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ కంట్రోల్ రూమ్ 08922 276888, బొబ్బిలి డివిజ‌న్ కంట్రోల్ రూమ్ 9390440932, చీపురుప‌ల్లి కంట్రోల్ రూమ్ 7382286268 నంబర్లను కేటాయించామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.

Similar News

News February 8, 2025

VZM: జిల్లా ఎస్పీ దృష్టికి పోలీస్ సిబ్బంది సమస్యలు

image

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సంక్షేమ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ వకుల్ జిందాల్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఎస్పీ పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని స్పష్టం చేశారు.

News February 7, 2025

VZM: మన మంత్రికి మీరిచ్చే ర్యాంక్ ఎంత?

image

అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి గజపతినగరం MLAగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు క్యాబినేట్‌లో MSME., సెర్ప్, NRI సాధికారత, సంబంధాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా కొండపల్లి మూడో ర్యాంకు సాధించారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20, సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. మరి కొండపల్లి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?

News February 7, 2025

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: VZM SP

image

విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 8 వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉంటుందని, పక్కాగా అమలయ్యేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల ఫొటోలు ఉండరాదన్నారు. ముఖ్యంగా బెల్టు షాపులు లేకుండా చూడాలని, విస్తృతంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు.

error: Content is protected !!