News October 6, 2025

VZM: తొలేళ్ల ఉత్సవంలో భక్తుల ఇక్కట్లు

image

విజయనగరం తొలేళ్ల ఉత్సవానికి భక్తులు భారీ స్థాయిలో హాజరయ్యారు. ఇరుకు స్థలం కావడంతో భక్తులు వచ్చి పోయేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే బారికేడ్లను ఏర్పాటు చేయడంతోనే ఇబ్బందులు ఎదురయ్యాయని భక్తులు వాపోతున్నారు. గతంలో కేవలం సిరిమాను ఉత్సవం రోజునే బారికేడ్ల ఏర్పాట్లు ఉండేవని ఈ ఏడాది ఒక రోజు ముందుగానే పెట్టారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 21, 2026

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి జాతర తేదీలు ఖరారు..

image

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. జాతర వివరాలు..
➱ఫిబ్రవరి 22న (ఆదివారం) జాతర ప్రారంభం
➱23న (సోమవారం) పసుపు, కుంకుమ ముర్రాటలతో మొక్కుబడులు చెల్లింపులు
➱24న మంగళవారం రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.
వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

News January 21, 2026

తిరుమలలో ఆ దర్శనాలన్నీ రద్దు

image

రథసప్తమి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పలు దర్శన సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఎన్‌ఆర్‌ఐ, చంటి బిడ్డలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేశారు.