News August 20, 2025

VZM: ‘పరిసరరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి’

image

ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారిణి జీవనరాణి సూచించారు. జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రపంచ దోమల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ రోనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. డ్రై డే ఫ్రైడే తప్పనిసరిగా పాటించాలన్నారు.

Similar News

News January 17, 2026

VZM: వాట్సాప్‌లో పోలీస్ సేవలు.. నంబర్ ఇదే!

image

విజయనగరం జిల్లాలో ప్రజలు ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా సేవలు పొందవచ్చని SP దామోదర్ శనివారం తెలిపారు. ‘మనమిత్ర’ విధానం ద్వారా FIR కాపీలు, ఈ-చలాన్ స్థితిని ఇంటి నుంచే తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.

News January 17, 2026

రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి

image

శ్రీకాకుళం జిల్లా రణస్థలం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. మృతుడు నెల్లిమర్ల (M) తమ్మాపురం గ్రామానికి చెందిన కోటి(25)గా గుర్తించారు. తల్లిని శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. దీనిపై జె.ఆర్‌పురం పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 17, 2026

VZM: పండగకి ఇంత తాగేశారా..!

image

విజయనగరం జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో మందుబాబులు వైన్ షాపులు, బార్లకు క్యూ కట్టారు. ఏకంగా రూ.13.81 కోట్ల మద్యాన్ని ఫుల్‌గా తాగేశారు. జిల్లాలో 225 మద్యం షాపులు, 26 బార్లు ఉన్నాయి. ఈనెల 13,14 తేదీల్లో 52,090 కేసుల ఐఎంఎల్ మద్యం, 16న 485 బీర్ కేసుల విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.