News August 21, 2025

VZM: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని విజయనగరం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ దేవి మాధవి బుధవారం తెలిపారు. ఇంటర్ అర్హత గల విద్యార్థులు రూ.100 ఫీజుతో వచ్చే నెల 9వ తేదీ లోపు ప్రభుత్వ వైద్య కళాశాలకు దరఖాస్తు సమర్పించాలన్నారు. దరఖాస్తు https://vizianagaram.nic.inలో అందుబాటులో ఉందన్నారు. MPC, BiPC విద్యార్థులకు తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. >Share it

Similar News

News January 21, 2026

T20WC ఆడతామో.. లేదో: బంగ్లా కెప్టెన్

image

టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. బోర్డు తీరుతో మీరు ఏకీభవిస్తున్నారా? అని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ అంశంపై నేను మాట్లాడటానికి ఏమీ లేదు. వరల్డ్ కప్ ఇంకా చాలా దూరంలో ఉంది. జట్టు పాల్గొంటుందో లేదో నేను కచ్చితంగా చెప్పలేను. ఇండియాకు వెళ్లడానికి నిరాకరించే ముందు బోర్డు మాతో ఏమీ డిస్కస్ చేయలేదు’ అని చెప్పారు.

News January 21, 2026

రాష్ట్రంలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌లు

image

తెలంగాణలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘నగర్ వన్ యోజన’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.8.26 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్ గూడ-II, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, మేడ్చల్ జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్కుల ఏర్పాటు జరుగుతుంది.

News January 21, 2026

VJA: మహిళ వేషం ధరించి చోరీ.. నిందితుడి అరెస్ట్

image

మహిళ వేషం ధరించి బంగారం చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.కండ్రికకు చెందిన ఓ వృద్ధురాలని అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి మహిళ వస్త్రాలు ధరించి బంగారం సోమవారం చోరీ చేశాడు. ఈ ఘటనపై సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేసినట్లు నున్న సీఐ కృష్ణమోహన్ తెలిపారు. అతని వద్ద నుంచి బంగారం లాకెట్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.