News April 25, 2024
VZM: పోక్సో కేసులో నిందితుడికి జైలు

విజయనగరం దిశ మహిళా పోలీసు స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. పూసపాటిరేగ మండలం కృష్ణాపురానికి చెందిన జి.రాంబాబు(27)పై 2021లో పోక్సో కేసు నమోదయ్యింది. ఈ మేరకు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి ఏడేళ్లు జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించారని దిశా స్టేషన్ ఇన్ ఛార్జ్ డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు.
Similar News
News February 8, 2026
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు: చిన్న శ్రీను

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై CM చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యవహరించారని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మండిపడ్డారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యున్నత ల్యాబ్‌లు అయిన NDRI, NDDB తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసిందన్నారు. మాట మార్చడంలో CM సిద్ధహస్తుడన్నారు.
News February 8, 2026
విజయనగరం జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు

జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు.
➭బాడంగి, గరివిడి, ఎస్.కోటలో మూడు ఫుడ్ పార్కులు ఏర్పాటు
➭పూసపాటిరేగ మండలం రెల్లివలసలో 201 ఎకరాల్లో హెల్త్‌కేర్ ప్రాజెక్ట్
➭ఎస్.కోట–కొత్తవలసలో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు
➭10 వేల ఎకరాల్లో ఉద్యానవనాలు (అరటి, ఆయిల్‌పామ్) సాగు, పెంపకం వంటి ప్రతిపాదనలు
News February 8, 2026
VZM: ఈనెల 9 ఏపీపీఎస్సీ పరీక్షలు

APPSC-2026 నియామక పరీక్షలు ఈనెల 9 నుంచి 11 వరకు విజయనగరంలో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి నూకరాజు శనివారం తెలిపారు. ఆటవీ, దేవదాయ శాఖలకు చెందిన పోస్ట్‌లకు JNTU, సీతం ఇంజినీరింగ్ కాలేజీల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 6,700 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.


