News July 12, 2024
VZM: మరో ఆరునెలల్లో రిటైర్మెంట్.. అంతలోనే..

లద్దాక్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలిన ఘటనలో మృతి చెందిన బొత్సవానివలసకు చెందిన జవాన్ <<13611983>>గొట్టాపు శంకర్రావు<<>>(41) మరో ఆరు నెలల్లో రిటైర్ కాబోతున్నారు. 2003లో ఆర్మీలో చేరిన ఆయన మెకానిక్‌గా పనిచేస్తున్నారు. శంకర్రావుకు భార్య, తొమ్మిదేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారు. ఫిబ్రవరిలో ఇంటికి వచ్చి సరదాగా గడిపారని అతని తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్నారు. మృతదేహాన్ని హెలికాప్టర్‌లో స్వగ్రామానికి తీసుకురానున్నారు.
Similar News
News July 10, 2025
VZM: అగ్నిపథ్‌లో అవకాశాలు

అగ్నిపథ్ పథకంలో భాగంగా భారతీయ వాయుసేనలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 4 ఏళ్ల కాల పరిమితికి అగ్నివీర్(వాయు)గా చేరడానికి అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 11న ఉదయం 11 గంటలకు ప్రారంభమై, జులై 31న రాత్రి 11 గంటలకు ముగుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News July 10, 2025
నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెట్టాలి: SP

నేరాల నియంత్రణకు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు శక్తి యాప్‌పై అవగాహన చేపట్టాలన్నారు. విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించేందుకు శక్తి వారియర్స్ టీమ్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.
News July 9, 2025
గ్రంథాలయాల అభివృద్దికి చర్యలు: జేసీ

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని జేసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్‌ఛార్జ్ ఎస్.సేతు మాధవన్ ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ బడ్జెట్ సమావేశం జేసీ ఛాంబర్‌లో బుధవారం జరిగింది. పౌర గ్రంథాలయశాఖ డైరెక్టర్ సూచనలు, కేటాయించిన బడ్జెట్‌కు అనుగుణంగా, త్వరలో జరగబోయే సర్వసభ్య సమావేశం గురించి, ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో చర్యలు గురించి చర్చించారు.