News August 14, 2025

VZM: రేపు ఉచిత బస్సులను ప్రారంభించనున్న మంత్రి కొండపల్లి

image

స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ VZM ఆర్టీసీ బస్ స్టేషన్‌లో ప్రారంభించనున్నారు. రెండు డిపోలకు సంభంధించి 160 బస్సులు నడుస్తుండగా మహిళల ఉచిత ప్రయాణం కోసం 137 బస్సులు వినియోగించనున్నారు. ప్రస్తుతం రోజుకు 12,900 మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణం ద్వారా 21,500 ప్రయాణం చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Similar News

News March 6, 2026

VZM: ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీ ఆవిష్కరణ

image

ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీను విడుదల చేసి అధికారులకు అందజేశారు. ప్రభుత్వ పరిపాలనలో రోజువారీ కార్యక్రమాలు, పరిపాలన సంబంధిత అంశాలను నమోదు చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డీఆర్‌ఓ మురళీ, తదితరులున్నారు.

News March 5, 2026

VZM: మిషన్ హార్టీ విజన్‌తో ఉద్యాన సాగు విస్తరణ

image

జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో అదనంగా 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

News March 5, 2026

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO

image

వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జీవన రాణి సూచించారు. విజయనగరంలోని తన కార్యాలయం ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత అధికమై ప్రాణాపాయం కలగొచ్చని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, మగత, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలో తిరగకూడదని, తగినంత నీరు తాగాలన్నారు.