News August 30, 2024

VZM: ‘రోగుల నుంచి డబ్బులు తీసుకుంటే చర్యలు’

image

ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులు, సంబంధిత కుటుంబ సభ్యుల నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా.. సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంతో పాటు వైద్యులు, సిబ్బందిపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ సమన్వయకర్త అప్పలరాజు హెచ్చరించారు. గురువారం ఆరోగ్యశ్రీ అనుబంధ విభాగం ఆసుపత్రుల యాజమాన్యాలతో నగరంలోని మహారాజ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఉచిత చికిత్స, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

Similar News

News September 9, 2024

VZM: అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచన

image

బెంగుళూరు పర్యటనలో ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందల్ ‌తో ఫోన్‌లో సోమవారం మాట్లాడారు. విజయనగరంలో తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.భోగాపురం పోలీసులను అలెర్ట్ గా ఉంచాలని కోరారు.

News September 9, 2024

కొట్టుకుపోయిన పారాది తాత్కాలిక కాజ్ వే

image

బొబ్బిలి మండలం పారాది కాజ్ వే పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పారాది వద్ద వేగావతి నదిపై బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి పాతదైపోయింది. దానిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా తాత్కాలిక కాజ్ వేను నిర్మించారు. వర్షాలకు కాజ్ వే ధ్వంసం కావడంతో భారీ వాహనాలను మళ్లించారు. విజయనగరం నుంచి బొబ్బిలి, పార్వతీపురం వెళ్లేందుకు ఈ మార్గమే దిక్కు.

News September 9, 2024

అత్యవసర సేవలకు కంట్రోల్ రూముల ఏర్పాటు: కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం నంబర్ 08922-236947, విజయనగరం డివిజన్ కంట్రోల్ రూం: 08922-276888, బొబ్బిలి డివిజన్ కంట్రోల్ రూం: 9390440932, చీపురుపల్లి డివిజన్ కంట్రోల్ రూం: 7382286268 నంబర్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఏ అవసరం ఉన్నా కంట్రోల్ రూం నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.