News February 24, 2025
VZM: శివరాత్రి రోజున మాంసం విక్రయాలు జరపకుండా నిషేధించాలి

ఈ నెల 26 న మహాశివరాత్రి రోజున జిల్లాలో ఎక్కడా మాంసం విక్రయాలు జరపకుండా నిషేధం విధించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్య వేదిక అధ్యక్షుడు మద్దిల సోంబాబు డిమాండ్ చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజారోగ్య శాఖాధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. హిందూ పవిత్ర పర్వదినాల్లో కూడా మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 18, 2025
భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.
News March 18, 2025
VZM: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

విజయనగరం జిల్లా బాడంగి మండలంలో కరెంట్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. వేపాడ మండలం డబ్బిరాజు పేటకు చెందిన రామ్‌కుమార్ బొత్సవాని పాలెంలోని బెల్లం క్రషర్ వద్ద పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం సామగ్రిని వ్యాన్‌లోకి ఎక్కిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో రామ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాడంగి సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
News March 18, 2025
విజయనగరం: మహిళలు శక్తి యాప్‌ను తప్పనిసరిగా వాడాలి

రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం ఏర్పాటుచేసిన శక్తి యాప్ ప్రతి ఒక్క మహిళలు తమ ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..శక్తి యాప్ మహిళల నివాసం, కార్యాలయం, ప్రయాణంలో రక్షణ కల్పించేలా రూపొందించింది పడిందని, ఈ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు భద్రత కొత్తదారులు తెరుచుకున్నాయని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.