News November 19, 2025

VZM: ‘100 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సిద్ధం కావాలి’

image

పదో తరగతిలో ఈసారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు డిసెంబర్ 5వ తేదీ లోపు సిలబస్ పూర్తిచేయాలని DEO మాణిక్యం నాయుడు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడారు. గత ఏడాది 87% పాస్ రేట్‌తో 7వ స్థానంలో నిలిచిందన్నారు. ఈసారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులందరూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం సిలబస్ పూర్తి చేసి, 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని అన్నారు.

Similar News

News January 24, 2026

కొత్తవలస రైల్వేస్టేషన్‌లో అమృత్ భారత్ రైళ్ల నిలుపుదల

image

అమృత్ భారత్ స్టేషన్‌గా అభివృద్ధి చెందుతున్న కొత్తవలస రైల్వే స్టేషన్‌లో పలు అమృత్ భారత్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ సీఎమ్ కె. పవన్ కుమార్ తెలిపారు. రైళ్లు (16597/98, 16223/24, 16107/08, 16523/24) ఇకపై ఇక్కడ ఆగనున్నాయన్నారు. ఈ రైళ్లు విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండా విజయనగరం, కొత్తవలస, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు.

News January 24, 2026

VZM: ‘పరిశ్రమల అనుమతులు గడువు లోపలే ఇవ్వాలి’

image

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను గడువు లోపలే ఇవ్వాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. సింగిల్ విండో విధానం ద్వారా డిసెంబర్ 26 నుంచి జనవరి 20 వరకు వచ్చిన 649 దరఖాస్తుల్లో 618కి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. భూ సమస్యలను పరిష్కరిస్తామని, పారిశ్రామిక వేత్తలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.