News December 17, 2024

VZM: 19న అల్పపీడనం ప్రభావంతో జిల్లాకు భారీ వర్ష సూచన

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 19న జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. రైతులకు తమ వరి పంటకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News January 14, 2025

సాలూరు: రోడ్డు ప్రమాదం.. యువకుడి స్పాట్ డెడ్

image

దుగ్గేరు నుంచి సాలూరు వస్తున్న సాలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని సాలూరు పట్టణానికి చెందిన బలగ శ్యామ్ (19) మృతి చెందాడు. దుగ్గేరు నుంచి సాలూరు వస్తున్న బస్సుకు చంద్రమ్మపేట సమీపాన ద్విచక్రవాహనంతో ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ బస్సుకిందలకు పోయి నుజ్జునుజ్జు అయింది. సాలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 14, 2025

బొండపల్లిలో లారీ బీభత్సం.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

బొండపల్లి మండలంలోని గొట్లాం సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతి చెందిన వారిలో బొండపల్లి మండలం చందకపేటకు చెందిన లవణ్ కుమార్, ఒడిశా రాష్ట్రానికి చెందిన మరొకరిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

News January 14, 2025

పార్వతీపురం: కండల వీరుడు కోడి రామ్మూర్తి నాయుడు వర్ధంతి

image

కండల వీరుడు కోడి రామ్మూర్తి నాయుడు 1883 నవంబర్ 3న వీరఘట్టంలో జన్మించారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో విజయనగరంలోని తన చిన్నాన్న దగ్గర పెరిగాడు. చిన్నప్పటి నుంచి వ్యాయామాల పై ఆసక్తి ఉన్న ఆయన 20 ఏళ్లకే గుండెలపై 1 1/2 టన్ను బరువు మోసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విజయనగరంలో సర్కాస్ కంపెనీ స్టార్ట్ చేసిన ఆయన గుండెలపై ఏనుగు ఎక్కించుకొని అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందారు. 1942 జనవరి 14న తుది శ్వాస విడిచారు.