News May 24, 2024
VZM: 6 కేంద్రాలు.. 1470 మంది అభ్యర్థులు

VZM జిల్లాలో డిప్యూటీ DEO పరీక్షను 6కేంద్రాల్లో అధికారులు శనివారం నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షకు 1470 మంది హాజరుకానున్నారు. రాజాం GMR కళాశాలలో 300 మంది, చింతలవలసలోని MVGR- 250, భోగాపురంలోని అవంతి- 170, బొబ్బిలిలోని స్వామి వివేకానంద- 90, విజయనగరంలోని సత్య- 150, కొండకరకాం సీతం కాలేజీలో 510 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఉదయం 9 నుంచి 11:30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 17, 2025
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతుల పుస్తకావిష్కరణ

విజయనగరానికి చెందిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ఠ సేవా పురస్కార గ్రహీత సముద్రాల గురు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతుల పుస్తకాని రచించారు. ఈ పుస్తకాని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆవిష్కరించారు. 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగినప్పుడు స్పీకర్‌గా ఉన్న వెంకటరామయ్య చౌదరి నుంచి నేటి శాసన సభాపతి వరకు 23 మంది శాసనసభాపతుల రాజకీయ జీవిత విశేషాలపై రాసిన పుస్తకం బాగుందని అభినందించారు.
News February 16, 2025
విశాఖలో IPL.. మ్యాచ్‌లు ఎప్పుడంటే..?

IPL అంటేనే అదొక మజా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి నేరుగా మ్యాచ్ చూడలేని వాళ్లు టీవీలు, మొబైల్లో ఐపీఎల్‌ను ఆస్వాదిస్తారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్‌లను ఈ సీజన్‌లో విశాఖ ప్రజలు నేరుగా చూడవచ్చు. ఢిల్లీ జట్టు విశాఖ స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకోవడంతో ఇక్కడ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 24న లక్నోతో, 30న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ తలపడనుంది.
News February 16, 2025
రామతీర్థంలో 26 నుంచి శివరాత్రి జాతర

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు శివరాత్రి జాతర మహోత్సవం జరగనుంది. 26, 27 తేదీల్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు జాగరణ చేస్తారు. 28న వేద పారాయణం అనంతరం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపిస్తారు. జాతరకు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.