News August 22, 2025
Way2News కథనానాకి స్పందన.. వెలిగిన జనగామ బ్రిడ్జి లైట్లు

‘గాండాంధకారంగా జనగామ బ్రిడ్జి’ అనే శీర్షికతో ఇటీవల Way2News ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. సంవత్సరం నుంచి లైట్లు సరిగా వెలగకపోవడంతో ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు. దీంతో వార్త ప్రచురించగా.. కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. బ్రిడ్జిపై ఉన్న లైట్లకు మరమ్మతులు చేయించి లైట్లు వెలిగేలా చేశారు. స్థానికులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 23, 2026
అనకాపల్లి: ‘జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటించాలి’

జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో హరిత ట్రిబ్యునల్ జిల్లాస్థాయి కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. నగరాల్లో చెత్త సేకరణను పక్కాగా అమలు చేయాలన్నారు. మురికి కాలవల్లో నీరు మంచినీటి వనరుల్లో కలవకుండా చూడాలన్నారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించాలన్నారు.
News January 23, 2026
ల్యాండ్ రికార్డులను బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటలైజ్ చేయాలి: SC

దేశంలో బలహీనమైన ల్యాండ్ రికార్డుల వ్యవస్థతో భూ వ్యాజ్యాలు పెరిగిపోతున్నాయని SC వ్యాఖ్యానించింది. ల్యాండ్ రికార్డులు ట్యాంపర్‌కు ఆస్కారం లేని విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటలైజ్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మోడ్రన్ ఎకానమీలో ప్రాపర్టీ టైటిల్స్ శాంక్టిటీతో ఉండాలని జస్టిసులు రాజేశ్ బిందాల్, మన్మోహన్ అభిప్రాయపడ్డారు. రిజిస్టర్డ్ డాక్యుమెంటు లాంఛనం కాదని ఓకేసులో పేర్కొన్నారు.
News January 23, 2026
నగరిలో CM కాన్వాయ్ ట్రయల్ రన్

నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో కాన్వాయ్ ట్రయల్ రన్ శుక్రవారం నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి ట్రయల్ రన్ ప్రారంభమైంది. కీలక పాయింట్లు, ట్రాఫిక్ డైవర్షన్లు, సేఫ్టీ జోన్లపై సిబ్బందికి స్పష్టత ఇచ్చారు. వాహనాల మధ్య తగిన గ్యాప్ ఉండేలా పరిమిత వేగంతో, క్రమశిక్షణతో ప్రయాణించాలని ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.


