News September 12, 2025

క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నాం: సత్యకుమార్

image

క్యాన్సర్‌కు మంచి వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ Way2News Conclaveలో పేర్కొన్నారు. ‘క్యాన్సర్ కారణంగా అమ్మ, అక్కని కోల్పోయాను. 18Y+ అమ్మాయిలకు బ్రెస్ట్, 30Y+ మహిళలకు సర్వైకల్ క్యాన్సర్‌కు స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇప్పటికే 2.92 కోట్ల మందికి ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేశాం. బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు స్త్రీలు ముందుకు రావట్లేదు’ అని తెలిపారు.

Similar News

News December 9, 2025

గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

image

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.

News December 9, 2025

‘ద్వార లక్ష్మీ పూజ’ ఎలా చేయాలి?

image

ఉదయాన్నే లేచి గడపను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. 3 వత్తుల దీపం, బెల్లం, అటుకులు, తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. గణేషుడిని నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కే వరకు ఉంచి, తర్వాత తొలగించాలి. పూజ పూర్తయ్యాక నిద్రపోవడం శుభకరం కాదు. పెళ్లికానివారు, ఇంటి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు.

News December 9, 2025

IIIT కొట్టాయంలో ఉద్యోగాలు

image

<>IIIT<<>> కొట్టాయం 13 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, LLB, MBA, ఇంజినీరింగ్, డిప్లొమా, MSc, MCA, ఇంటర్+ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/టెక్నికల్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitstaff.iiitkottayam.ac.in