News April 14, 2024

గ్యారంటీలను అమలు చేసే పార్టీ మాదే: మంత్రి సురేఖ

image

TG: గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్‌‌లో లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ 100 హామీలను ఇచ్చి నెరవేర్చలేకపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు BRSకు లేదని మండిపడ్డారు. పేదలకు సంక్షేమ పథకాలను అందజేసే పార్టీ కాంగ్రెస్ అని నొక్కి చెప్పారు.

Similar News

News December 14, 2025

MBNR: 11 గంటల వరకు 55 శాతం పోలింగ్

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 06 మండలాలలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉదయం 07 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు 55 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చిన్నచింతకుంట, కౌకుంట్ల, హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, దేవరకద్ర మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

News December 14, 2025

TG రెండో దశ సర్పంచ్ ఎన్నికల అప్డేట్స్

image

* ఖమ్మం(D) అనాసాగరంలో సర్పంచ్ అభ్యర్థి దామల నాగరాజు(40) కన్నుమూశారు. నామినేషన్‌ రోజే అనారోగ్యంతో ఆస్పత్రి పాలవగా ఇవాళ పోలింగ్ రోజు చనిపోయారు.(ఫొటోలోని వ్యక్తి)
* నారాయణపేట(D) మరికల్‌కు చెందిన భాస్కర్ దుబాయ్ నుంచి వచ్చి ఓటు వేశారు.
* ఖమ్మం(D) గోళ్లపాడులో ఓ అభ్యర్థి స్లిప్‌తో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పోలింగ్ కేంద్రం వద్ద ఓ ఆకులోని అన్నం, బొగ్గులు, మాంసం, ఎండుమిర్చి, అభ్యర్థి స్లిప్ పెట్టారు.

News December 14, 2025

40 రోజుల్లో 150కి పైగా పెళ్లిళ్లు రద్దు.. కారణమిదే?

image

MPలోని ఇండోర్‌లో 40 రోజుల వ్యవధిలో 150కి పైగా జంటలు తమ పెళ్లిని రద్దు చేసుకున్నాయి. దీనికి ప్రధాన కారణం(62%) సోషల్ మీడియానే అని ఓ నివేదిక తెలిపింది. పాత రిలేషన్లకు సంబంధించిన SM పోస్టులు గొడవకు దారి తీస్తున్నాయని వెల్లడించింది. మరికొన్ని ఘటనల్లో కుటుంబంలో మరణాలు, ఇతర కారణాలు ఉన్నాయని తెలిపింది. ఇలా ఆకస్మిక రద్దు నిర్ణయాలతో వెడ్డింగ్ ప్లానర్స్, హోటల్ నిర్వాహకులు నష్టపోతున్నారని తెలిపింది.