News April 27, 2024
‘పుష్ప’లో కేశవ రోల్‌కు సుహాస్‌ను అనుకున్నాం: సుకుమార్

హీరో సుహాస్ అంటే తనకు, అల్లు అర్జున్‌కు చాలా ఇష్టమని డైరెక్టర్ సుకుమార్ వెల్లడించారు. ‘ప్రసన్నవదనం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ‘పుష్ప సినిమాలో కేశవ రోల్ కోసం సుహాస్‌నే అనుకున్నాం. కానీ హీరోగా చేస్తున్న నిన్ను ఆ పాత్ర కోసం తీసుకోవడం బాగోదనిపించింది. న్యాచురల్ స్టార్ నానిలా సుహాస్ అద్భుతంగా నటిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అర్జున్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మే 3న విడుదల కానుంది.
Similar News
News April 18, 2026
ఈ ఆహారంలో పుష్కలంగా విటమిన్ B12

విటమిన్ B12 <<19680368>>లోపాన్ని<<>> నివారించేందుకు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగులో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ‘శాకాహారులు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడండి’ అని వివరిస్తున్నారు.
News April 18, 2026
విజయ్ చేతిలో శునకాలు.. ఆసక్తికరంగా కొత్త సినిమా పోస్టర్

హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో చేయనున్నట్లు ప్రకటించారు. దర్శకుడి ఊహాశక్తికి తగ్గట్టుగా ఈ మూవీ కోసం తన సర్వస్వాన్ని అందిస్తానని విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలెజాండ్రో మార్టినెజ్(DOP), హేశమ్ అబ్దుల్ వాహెబ్(మ్యూజిక్), ఎరిక్ డర్స్ట్(VFX)ను పరిచయం చేశారు. హీరో శునకాలను, డైరెక్టర్ గుర్రాన్ని పట్టుకున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.
News April 18, 2026
గూగుల్, మెటాకు భారతీరెడ్డి లీగల్ నోటీసులు

గూగుల్, మెటా, X, యూట్యూబ్‌కు వైఎస్ జగన్ సతీమణి భారతీ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. సోషల్ మీడియాలో తనపై చేసిన తప్పుడు పోస్టులు, పరువుకు నష్టం కలిగించే పోస్టులను తొలగించాలని నోటీసులు ఇచ్చారు. కావాలనే తనను టార్గెట్ చేస్తూ పోస్టులు చేశారని పేర్కొన్నారు. తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను తొలగించాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. థింక్ ఆంధ్ర, M9 న్యూస్ సంస్థలకూ నోటీసులు పంపారు.


