News August 23, 2025

సాఫ్ట్ డ్రింక్స్ బ్యాన్ చేస్తాం.. USకు LPU ఫౌండర్ వార్నింగ్

image

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఫౌండర్ అశోక్ కుమార్ మిట్టల్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. భారత్‌పై 50% టారిఫ్స్‌ను ఆగస్టు 27లోగా వెనక్కి తీసుకోకపోతే చండీగఢ్‌లోని తమ క్యాంపస్‌లో అమెరికా సాఫ్ట్ డ్రింక్స్‌, బేవరేజ్ కంపెనీలను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. తమ యూనివర్సిటీలో 40వేల మంది విద్యార్థులు ఉన్నారని, దేశంలోని అతిపెద్ద వర్సిటీల్లో ఒకటని పేర్కొన్నారు.

Similar News

News January 15, 2026

బాలింతలు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా?

image

పాలిచ్చే తల్లులు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా లేదా అనేది వారి ఆరోగ్యస్థితిపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే పిల్లల వయసు, ఆరోగ్యం, తల్లికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాస్తారు. పాలద్వారా యాంటీబయాటిక్స్ తక్కువ మొత్తంలోనే ట్రాన్స్‌ఫర్ అవుతాయి. అయినా ఇలాంటి మందులేవైనా వాడేముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోనే వాటిని వాడాలని సూచిస్తున్నారు.

News January 15, 2026

విమానాలు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

image

నిరసనల కారణంగా ఇరాన్‌ <<18861323>>గగనతలాన్ని<<>> మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో ఎయిరిండియా, ఇండిగో సహా భారతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. కొన్ని అంతర్జాతీయ విమానాలను దారిమళ్లిస్తున్నట్లు, మరికొన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మార్పులు, అప్డేట్ల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లను పరిశీలించాలని కోరాయి. మరోవైపు ఇప్పటికే కేంద్రం ఇరాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేసింది.

News January 15, 2026

కనుమ నాడు గోవులకు పూజ ఎందుకు చేస్తారు?

image

కనుమ అంటేనే పశువుల పండుగ. అవి ఏడాదంతా పొలం పనుల్లో రైతుకు చేదోడువాదోడుగా ఉంటాయి. పంట చేతికి రావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకు కృతజ్ఞతగా నేడు వాటిని పూజిస్తాం. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలురను రక్షించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గోపూజ సంప్రదాయం మొదలైంది. ఆవును జంతువుగా మాత్రమే కాకుండా ప్రకృతికి, జీవనాధారానికి ప్రతీకగా భావిస్తారు. ఆవును గౌరవించడం మన సంస్కృతిలో భాగం.