News February 15, 2025
చెప్పులతో కొడతాం: అపూర్వపై కర్ణి సేన ఫైర్

‘ఇండియా గాట్ లాటెంట్’ షోలో తల్లిదండ్రుల బంధంపై అసభ్యకర <<15437225>>కామెంట్స్<<>> చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వ మఖీజాపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ టూరిజం- IIFA కలిసి నిర్వహిస్తోన్న ‘ట్రెజర్ హంట్ షూట్’లో ఆమె పాల్గొంటుండటంపై నిరసనలు వ్యక్తం కావడంతో తొలగించారు. సంస్కృతి లేని అపూర్వ రాజస్థాన్‌కు రావొద్దని, ఒకవేళ వస్తే చెప్పులతో కొడతామని రాజ్‌పుత్ కర్ణి సేన హెచ్చరించింది.
Similar News
News March 13, 2026
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు జమ

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ చేశారు. PM కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ మూడో విడత కింద రూ.4వేలు.. మొత్తంగా రూ.6వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పెట్టుబడి సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది.
News March 13, 2026
FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ <<19369095>>మరోసారి<<>> తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,530 తగ్గి రూ.1,60,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,400 పతనమై రూ.1,47,300 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది.
News March 13, 2026
RTCలో సమ్మె: యాజమాన్యానికి JAC నోటీసు

TGRTC JAC.. యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది. ప్రధానంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, మహాలక్ష్మి పథకం కింద నెలకు ₹350 కోట్లు కోత లేకుండా నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ₹2,500 కోట్ల పాత బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల తొలగింపుతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరింది.


