News March 28, 2024

WGL: అదృశ్యమయ్యాడు.. శవమై కనిపించాడు

image

అదృశ్యమైన ఓ యువకుడు బావిలో శవమై తేలిన ఘటన KNR జిల్లా తిమ్మాపూర్‌లో జరిగింది. CI స్వామి వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన అభిలాశ్(20) తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా చేస్తున్నాడు. అయితే ఈనెల 1న రాత్రి అభిలాశ్ అదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం కుళ్లిన స్థితిలో ఓ వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించగా.. ఫోన్, దుస్తుల ఆధారంగా అభిలాశ్‌గా పోలీసులు గుర్తించారు.

Similar News

News February 11, 2026

WGL: 9 గంటల వరకు 12.44 శాతం పోలింగ్

image

వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో తొలి రెండు గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 12.44 శాతం ఓటింగ్ నమోదైంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 13.02 శాతంతో ఓటర్లు చైతన్యం చూపగా, నర్సంపేటలో 12.29 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.

News February 11, 2026

హరిత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వరంగల్ ఆర్డీఓ

image

వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఫిరంగిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘హరిత’ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ ఆర్డీఓ టి.సుమ బుధవారం సందర్శించారు. పర్యావరణ హితంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన ఈ కేంద్రాన్ని చూసి ఆమె ముగ్ధులయ్యారు. పోలింగ్ సరళిని అధికారులతో కలిసి సమీక్షించిన అనంతరం, హరిత పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ దగ్గర సహచర అధికారులతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు.

News February 11, 2026

వర్ధన్నపేట: ఓటర్లను ఆకట్టుకునేలా..!

image

వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా అధికారులు హరిత పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఫిరంగిగడ్డ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో అధికారుల బృందం ఏర్పాటు చేయించిన హరిత పోలింగ్ కేంద్రం విశేషంగా ఆకర్షిస్తోంది. హరిత పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు. హరిత పోలింగ్ కేంద్రంపై ప్రజాస్వామ్యం-ఓటు హక్కు విలువలను తెలుపుతూ నినాదాలు రాయించారు.