News May 20, 2024
WGL: అప్పుడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు
KMM-WGL-NLG MLC స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మల్లన్న (INC), రాకేశ్ రెడ్డి (BRS), ప్రేమేందర్ రెడ్డి (BJP) పోటీ చేస్తున్నారు. అయితే ముగ్గురు గతంలో BJPలో ఉన్నవారే. తీన్మార్ మల్లన్న 2021లో BJPలో చేరి, తిరిగి 2023లో హస్తం గూటికి చేరారు. ప్రేమేందర్ రెడ్డి BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాకేశ్ రెడ్డి 2013లో BJPలో చేరి BJYMలో అనేక పదవులు చేపట్టారు. ఈ ఏడాదే BRS పార్టీలో చేరారు.
Similar News
News December 8, 2024
ప్రత్యేక రూపంలో భద్రకాళి అమ్మవారు
వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈ రోజు ఆదివారం ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
News December 8, 2024
పరకాల: రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హసన్‌పర్తి మండలానికి చెందిన వేముల సుమన్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆటోలో రేగొండ వైపునకు వెళుతున్నారు. ఈ క్రమంలో పరకాల సమీపంలో శుక్రవారం సాయంత్రం వాగు సమీపంలో వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో సుమన్ కూతురు సాత్వికతో పాటు పలువురు గాయపడ్డారు. సాత్వికను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
News December 7, 2024
వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్: ఎంపీ కావ్య
వరంగల్ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. టెక్స్‌టైల్ పార్క్ సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ కావ్య మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో నిత్యం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందన్నారు.