News April 25, 2024
WGL: కాంగ్రెస్‌లోకి గుండు సుధారాణి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో గుండు సుధారాణికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత నెల రోజులుగా గుండు సుధారాణి బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఊహాగానాలు వినిపించాయి. గురువారం పార్టీ మారడంతో ఊహాగానాలు నిజమయ్యాయి.
Similar News
News April 16, 2026
గీసుగొండ: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గీసుగొండ మండలం కోనాయిమాకులం రైతు వేదికలో మండల స్థాయి సమావేశం జరిగింది. కలెక్టర్ డా. సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది ముఖ్య అంశాలపై అధికారులు, సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
News April 13, 2026
వరంగల్ ప్రజావాణిలో 166 వినతులు

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డా.సత్య శారద ప్రజల నుంచి 166 వినతిపత్రాలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 74, జీడబ్ల్యూఎంసీకి 25, ఇతర శాఖలకు 67 దరఖాస్తులు వచ్చాయి. సంబంధిత అధికారులతో సమక్షంలోనే చర్చించి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. జూమ్ ద్వారా తహశీల్దార్లు, ఎంపీడీవోలతో సమన్వయం చేసి చర్యలు చేపట్టారు.
News April 13, 2026
WGL: బర్త్‌డేలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..!

నర్సంపేటలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఉప్పరపల్లికి చెందిన చింతకింది శివకృష్ణ, మౌనిక దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు అక్షర 2020 జూన్ 3వ తేదీన జన్మించింది. రెండవ సంతానం అర్జున్ 2022, జూన్ 3వ తేదీన, మూడవ సంతానం ఆదిత్య 2024 జూన్ 3వ తేదీన జన్మించాడు. ముగ్గురూ ఒకే నెల, ఒకే తేదీన రెండేళ్ల వ్యవధిలో జన్మించడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.


