News December 1, 2025

WGL: గుర్తుల కేటాయింపులో అభ్యర్థులకు టెన్షన్!

image

సర్పంచ్, వార్డు సభ్యుల<<18436022>> ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు<<>>పై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే ప్రచారం బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుందని, ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News February 10, 2026

ఏలూరు: వివాహిత అనుమానాస్పద మృతి

image

మండవల్లి మండలంలోని నాగభూషణపురంలో వివాహిత మేఘన మంగళవారం అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతిచెందారు. ఛాతీనొప్పి రావడంతో కైకలూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. తన కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని మృతురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామచంద్రరావు తెలిపారు.

News February 10, 2026

489 మంది అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు

image

కాకినాడ జిల్లాలో రెండు విడతల్లో అర్హులైన 489 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అక్రిడేషన్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో 237, మంగళవారం మరో 252 మందికి అక్రిడేషన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సరైన ధ్రువపత్రాలు సమర్పించని 59 దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించారు.

News February 10, 2026

SVU : డిగ్రీ పూర్వ విద్యార్థులకు లాస్ట్ ఛాన్స్

image

SVU పరిధిలో (UG) డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సర ఇయర్ ప్యాటర్న్ ( వార్షిక పరీక్షలు) ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగం నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులకు ఇది చివరి అవకాశం అని పేర్కొన్నారు. ఇయర్ ప్యాటర్న్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ID ప్రూఫ్/ ఆధార్ ఒరిజినల్ తీసుకుని విశ్వవిద్యాలయంలో ఈనెల 20వ తేదీ నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చని సూచించారు.