News December 1, 2025
WGL: గుర్తుల పంచాయితీ!

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్‌కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.
Similar News
News February 17, 2026
జగిత్యాలలో వి’చిత్రం’.. వారికే వరుసగా వైస్ ఛైర్మన్ కుర్చీ

జగిత్యాల మున్సిపల్‌లో ఇప్పటివరకు ఏర్పడిన అన్ని పాలకవర్గాల్లో ప్రతిసారి వైస్‌ఛైర్మన్ పదవికి ఒకే ప్రాంతం నుంచి ఎన్నికవ్వడం ఆనవాయితీగా వస్తోంది. వార్డుల విభజన జరిగిన ప్రతీసారి వార్డ్ మెంబర్ మారినా, పట్టణంలోని గంజి ప్రాంతం నుంచే ఎన్నికవుతున్నారు. వీరిలో బదురోద్దిన్, యూసఫ్ అజాద్, కోటగిరి మురళి, మన్సూర్, గోలి శ్రీనివాస్ వైస్‌ఛైర్మన్ కాగా ప్రస్తుతం జీనత్ పర్వీన్ కూడా గంజి ఏరియా నుంచే ఎన్నికవ్వడం విశేషం.
News February 17, 2026
బిల్ గేట్స్ టూర్.. SMలో తీవ్ర విమర్శలు!

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నిన్న <<19155078>>అమరావతి<<>>లో పర్యటించడం తెలిసిందే. అయితే ఆయన భారత టూర్‌పై SMలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో గేట్స్ పేరు చాలా సార్లు ఉండటమే ఇందుకు కారణం. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న అలాంటి వ్యక్తితో ఎవరూ భేటీ కాకూడదని MP కాంగ్రెస్ నేత అనూప్ ధోటే ట్వీట్ చేశారు. తన ఉత్పత్తుల కోసం ఇండియాను ల్యాబ్‌లా ఆయన చూస్తారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
News February 17, 2026
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి సమన్వయంతో చర్యలు: కలెక్టర్

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశంలో ఉరవకొండ, గుంతకల్లు, ఆత్మకూరు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శిల్పారామం, గుత్తి కోట ఉత్సవాలు, బోటింగ్, హెరిటేజ్ వాక్ కార్యక్రమాలను నాణ్యతగా అమలు చేసి పర్యాటకులను ఆకర్షించాలని తెలిపారు.


