News March 12, 2025

WGL: గ్రూప్-2లో BC(A) విభాగంలో SIకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

image

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడో బెటాలియన్ రిజర్వ్‌డ్ ఎస్సై BC(A)లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్పల్లి ఏడో బెటాలియన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.

Similar News

News February 7, 2026

చిత్తూరు: ఏనుగుల దాడులకు ‘హనుమాన్‌’తో చెక్.!

image

రామకుప్పం(M)లో ఏనుగు ధాటికి పాడి <<19074524>>ఆవు<<>> మృతి చెందగా, GDనెల్లూరు నియోజకవర్గంలో పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. HANUMAN ప్రాజెక్ట్‌లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేస్తారు. వెటర్నరీ అసిస్టెంట్, శిక్షణ పొందిన రక్షణ సిబ్బంది, డ్రైవర్, ఆధునిక వాహనాలు, ట్రాంక్విలైజేషన్ పరికరాలు, డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు అందుబాటులో ఉంటాయి. జంతువులు నివాస ప్రాంతాల్లోకి వెళ్లగానే ప్రజలను అప్రమత్తం చేయనున్నారు.

News February 7, 2026

ఉయ్యురు: శిడిబండిలో ఆ కులానికే ప్రత్యేకం..!

image

ఉయ్యూరు వీరమ్మ ఉత్సవాలలో భాగంగా నేడు 11వ రోజు శిడిబండి ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో ఎస్సీ కులానికి చెందిన యువకుడిని కూర్చోబెట్టడానికి వెనక పెద్ద కారణం ఉంది. వీరమ్మ తల్లి సతీ సహగమనానికి గుండం తవ్వేందుకు ఉప్పర కులస్తులు ముందుకు రాకపోవడంతో మాదిగ వర్గానికి చెందిన వారు తవ్వినట్లు ప్రతీక. అందుకే శిడి బండి ఉత్సవం రోజున ఆ కులానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.

News February 7, 2026

సోమిరెడ్డికి కాకాణి సవాల్

image

నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారిందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రైతులను అడ్డం పెట్టుకుని పనులు చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు దోచుకున్నారన్నారు. ఈ అక్రమాలపై సీఎంకు లేఖ రాసినా స్పందన లేదని మండిపడ్డారు. అవినీతి ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు చేస్తున్నారని, విజిలెన్స్ విచారణకు సిద్ధమా అని సోమిరెడ్డికి సవాల్ విసిరారు.