News December 1, 2025

WGL: చెక్ పవర్‌పై దృష్టి!

image

పంచాయతీ ఎన్నికల వేడి గ్రామాల్లో రగులుకుంది. సర్పంచ్‌గా గెలిచే ఛాన్సు లేని దగ్గర వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్‌గా చేయాలని చూస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా చెక్ పవర్ ఇచ్చారు. పంచాయతీ నిధుల విడుదల సమయంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు సైతం ప్రాధాన్యం ఉండడంతో, చెక్ పవర్ ఇచ్చే ఉప సర్పంచ్ పదవులకు సైతం డిమాండ్ ఎక్కువైంది.

Similar News

News February 16, 2026

HYD: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్‌లో 10, HYD స్కార్ట్ డివిజన్‌లో 8, HYD సౌత్ ఈస్ట్ 16, సికింద్రాబాద్ డివిజన్‌లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం నెలకు రూ.12,000-29,380, వయసు 18-40 ఉండాలి.

News February 16, 2026

మెదక్: మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రతా: ఎస్పీ

image

మెదక్, నర్సాపూర్, రామాయంపేట్, తూప్రాన్ మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో 163 BNSS ( సెక్షన్ 144) ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.

News February 16, 2026

గద్వాల: మూడు తరాలు.. ఒకే కుటుంబం.. తుమ్మల వారి అరుదైన రికార్డు!

image

గద్వాల మున్సిపల్ రాజకీయంలో ‘తుమ్మల’ కుటుంబం సరికొత్త చరిత్ర సృష్టించింది. 1988లో మామ, 2000లో అత్త, 2014లో భర్త కౌన్సిలర్లుగా ఎన్నికవ్వగా.. ఇప్పుడు అదే వారసత్వంతో తుమ్మల జయలక్ష్మి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 30 ఏళ్లుగా మూడు తరాలుగా విజయం సాధిస్తూ ఈ కుటుంబం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.