News December 2, 2025
WGL: నేనూ.. గ్రామానికి ప్రథమ పౌరుడిని..!

ఉమ్మడి జిల్లాలో GP ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. సర్పంచ్ పదవికి భారీ పోటీ ఉన్నా, గౌరవ వేతనం మాత్రం నెలకు రూ.6,500. 2015లో వేతనం రూ.5,000గా నిర్ణయించగా 2021లో రూ.6,500గా పెంచారు. అభివృద్ధి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆదాయం లేక అప్పులు మాత్రం భారం అవుతున్నాయి. అయినా ‘గ్రామానికి ప్రథమ పౌరుడు’ అన్న గౌరవం, ప్రతిష్ఠ కోసం రూ.లక్షలు ఖర్చు చేసి పోటీ పడుతున్నారు. మీ గ్రామాల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News February 13, 2026
BREAKING.. పరకాల మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే!

పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వరుసగా రెండు, మూడో రౌండ్లలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఫస్ట్ రౌండ్లో 2 వార్డులు, రెండో రౌండ్లు 5 వార్డులు, మూడో రౌండ్లో 4 వార్డులు దక్కించుకుంది. మొత్తం 22 వార్డుల్లో ఇంకా రెండు వార్డుల లెక్కింపు మిగిలి ఉండగానే.. ఛైర్మన్ పీఠానికి కావాల్సిన 11 వార్డులను కైవసం చేసుకుంది.
News February 13, 2026
సమస్యలు తీరే వరకు నా పోస్టులు ఆగవు: కొలికపూడి

తిరువూరు నియోజకవర్గంలో రోడ్లు, కనీస వసతుల లేమిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే నా లక్ష్యమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. “నేను అవినీతి చేయను, చేయనివ్వను. ప్రజల కోసం వేసే వాట్సాప్ స్టేటస్‌లు, ట్వీట్లు కొనసాగుతాయి. నాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు” అని ఆయన పేర్కొన్నారు. సుపరిపాలనలో తిరువూరును అగ్రస్థానంలో నిలుపుతానని అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు.
News February 13, 2026
ఓట్ల కోసం బోరున ఏడ్చిన BJP అభ్యర్థి.. రిజల్ట్ ఇదే

TG: ‘ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ <<19103865>>కన్నీళ్లు<<>> పెట్టుకున్న యాదగిరిగుట్ట 9వ వార్డు BJP అభ్యర్థి ఉమ్మగండి రాజమణి ఓడిపోయారు. ‘దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్న నాకు ఓటెయ్యండి’ అంటూ ఆమె బోరున విలపించిన తీరు సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. నేటి ఫలితాల్లో 10 ఓట్లు మాత్రమే వచ్చినా రాజమణి నిరాశ చెందలేదు. డబ్బు, మద్యం తీసుకోకుండా బీజేపీకి ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.


