News November 16, 2025

WGL: ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో 5,025 కేసుల పరిష్కారం: సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. ఈ అదాలత్ ద్వారా 5,025 కేసులను పరిష్కరించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.89 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 20, 2026

వరంగల్: ‘ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి’

image

వరంగల్ జిల్లాలోని దివ్యాంగులకు వివిధ సహాయ ఉపకరణాల మంజూరుకు అర్హత కలిగిన వారు ఈనెల 30వ తేదీలోగా https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి బి.రాజమణి తెలిపారు. అర్హత గల వారికి బ్యాటరీ వీల్ ఛైర్లు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్, హైబ్రిడ్ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు (డిగ్రీ విద్యార్థులకు), ట్యాబులు మంజూరు చేసి అందిస్తామన్నారు.

News January 19, 2026

వరంగల్: మహిళలకు సురక్షిత పని వాతావరణం కల్పించాలి: కలెక్టర్

image

పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘పోష్’ యాక్ట్-2013పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి కార్యాలయంలో చట్టాన్ని పక్కాగా అమలు చేసి, గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొని మహిళా సాధికారతపై దిశానిర్దేశం చేశారు.

News January 19, 2026

WGL: సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోని ప్రజావాణి వినతులకు అధికారులు వేగంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ డా.సత్యశారద ఆదేశించారు. సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ఆమె బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.