News October 8, 2025

WGL: రూ.900 పెరిగిన 341రకం మిర్చి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం తేజా మిర్చి(ఏసీ) క్వింటాకు రూ.14,550 ధర పలకగా.. ఈరోజు రూ.14,700కి చేరింది. 341 రకం మిర్చి(ఏసీ)కి నిన్న రూ.15,300 ధర వస్తే.. బుధవారం రూ.16,200 అయింది. మరోవైపు, వండర్ హాట్(WH) ఏసీ మిర్చికి నిన్నటిలాగే ఈరోజు కూడా రూ.16వేలు అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News January 23, 2026

అనంతపురం JNTU విద్యార్థులకు భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో Accenture కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురికి రూ.6.5 లక్షలు, ఐదుగురికి రూ.4.5లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను VC సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించడంపై కళాశాలలో హర్షం వ్యక్తమైంది.

News January 23, 2026

బాపట్ల: రూ.102 కోట్లతో 260 కొత్త ఆరోగ్య కేంద్రాలు

image

బాపట్ల పార్లమెంట్ పరిధిలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు రూ.102.336 కోట్లతో 260 కొత్త ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ఆమోదం లభించిందని గురువారం MP కృష్ణప్రసాద్ తెలిపారు. మంజూరైన వాటిలో 234 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 18 బ్లాక్ హెల్త్ యూనిట్లు, 5 పీహెచ్‌సీలు, 1 క్రిటికల్ కేర్ బ్లాక్ ఉన్నాయని వివరించారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యమని వెల్లడించారు.

News January 23, 2026

బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఈనెల 29న విముక్తి

image

AP: బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 29న విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. విడుదలయ్యే వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 14 మంది ఉన్నారు. గత అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో వీరు అరెస్టయ్యారు.