News December 2, 2025
WGL: రెండో విడతకు నేడు చివరి రోజు

ఉమ్మడి జిల్లాలో రెండో దశ నామినేషన్ల స్వీకరణ నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రెండో విడతలో 564 జీపీలు, 4928 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 2 వరకు నామినేషన్ల స్వీకరణ అనంతరం, 3న పోటీలో ఉన్న వారి జాబితాను సాయంత్రం 5 గంటలకు ప్రదర్శించనున్నారు. 6న నామినేషన్ల ఉపసంహరణ, 14న పోలింగ్ ఉండనుంది. ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 1,365 నామినేషన్లు, వార్డు స్థానాలకు 3037 నామినేషన్లు దాఖలయ్యాయి.
Similar News
News February 16, 2026
జనగామ మున్సిపాలిటీ కార్యాలయ పరిధిలో నిషేధాజ్ఞలు

జనగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎంపిక నేపథ్యంలో జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు CP సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. మున్సిపల్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నేరమని హెచ్చరించారు.
News February 16, 2026
కోదాడ: లాకప్ డెత్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: జాతీయ ఎస్సీ కమిషన్

దళితుల రక్షణకు కమిషన్ కట్టుబడి ఉందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రరావు అన్నారు. కోదాడ లాకప్ డెత్ బాధితుడు రాజేశ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 10 రోజుల్లో రీ-పోస్టుమార్టం నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి పెన్షన్, ఇల్లు, మూడు ఎకరాల భూమి అందజేస్తామని హామీ ఇచ్చారు.
News February 16, 2026
విద్యుత్ ‘కట్‘కటా లేకుండా ఏర్పాట్లు

TG: ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది ఎండలు తీవ్రమై రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 18000 MW వరకు పెరగొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గ్రేటర్ HYDలోనే ఈసారి 4000 MW అవసరమని, యాసంగి(ఏప్రిల్, మే)లో సాగుకు వినియోగం పెరుగుతుందని భావిస్తోంది. దీనికి తగ్గట్టుగా యాదాద్రి ప్లాంటులో 4000 MW ఉత్పత్తికి చర్యలు తీసుకుంది. పీక్ అవర్‌లో విద్యుత్ రేట్లు భారీగా ఉన్నా కొనుగోలుకు రెడీ అవుతోంది. 2025లో 17500 MW డిమాండ్ ఉంది.


