News November 7, 2025
WGL: రోజురోజుకు తగ్గుతున్న పత్తి ధరలు

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గుతూ కంటతడి పెట్టిస్తున్నాయి. క్వింటా పత్తి ధర సోమవారం రూ.6,920, మంగళవారం రూ.6,950, గురువారం రూ.6,900 పలికాయి. నేడు మరింత పతనమై రూ.6,860కి చేరింది. ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.
Similar News
News January 24, 2026
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో 2024-25 సంవత్సరానికి దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌లకు సహాయ ఉపకరణాల మంజూరుకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన దివ్యాంగులు https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా 19-01-2026 నుంచి 30-01-2026 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కే.నరసింహారావు తెలిపారు. కమిటీ ద్వారా అర్హుల ఎంపిక జరుగుతుందని చెప్పారు.
News January 24, 2026
సింగరేణి ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి సమావేశం

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శనివారం ఇల్లందు గెస్ట్ హౌస్‌లో సింగరేణి ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. బొగ్గు ఉత్పత్తి స్థాయి, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి, అలాగే సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి రివ్యూ జరిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉత్పత్తి సాధించడం, అలాగే సింగరేణి సంస్థలు ఉన్న కీలక ప్రాజెక్టుల వేగవంతం చేయడం, స్థిరమైన అభివృద్ధి సాధించడంపై సీఎండీ ఉన్నతాధికారులతో చర్చించారు.
News January 24, 2026
మున్సిపల్ ఎన్నికలకు BRS ఇన్‌ఛార్జుల నియామకం

TG: త్వరలో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమన్వయకర్తలను నియమించారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు. వీరు అభ్యర్థుల ఎంపిక, శ్రేణులను సమన్వయం చేయడం, ప్రచార వ్యూహాలను రచిస్తారు. ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తారు. ప్రజల మద్దతుతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు KTR పిలుపునిచ్చారు.


