News December 1, 2025
WGL: వారెవ్వా.. ఇదేం కుటుంబ పాలన!

ఉమ్మడి WGL రాజకీయం కుటుంబ పాలనైంది. ఇదిలా ఉంటే చాలా నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యులే అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. అల్లుళ్ల గిల్లుడుతో అధికారులు అల్లాడుతుండగా, మరో దగ్గర అత్త పెత్తనం, మరో రెండు చోట్ల కొడుకుల ఆర్డర్లతో అధికారులు నలిగిపోతున్నారు. ఒక దగ్గర “సన్”స్ట్రోక్ ఉండగా, మరో దగ్గర కొండంత దూరంలో భర్త పరుగులు పెట్టిస్తున్నాడు. గెలిచిన వాళ్లకంటే వారి కుటుంబీకులే కీలకంగా మారిపోయారనేది టాక్.
Similar News
News February 13, 2026
కృష్ణా: పాఠశాలలకు రెండో శనివారం సెలవు రద్దు.!

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రకటించిన రెండో శనివారం సెలవును జిల్లా విద్యాశాఖ అధికారులు అనూహ్యంగా రద్దు చేశారు. DEO సుబ్బారావు సర్క్యులర్ జారీ చేస్తూ, రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా జిల్లా పరిధిలోని MEO, DYEOలు తమ తమ మండలాల ప్రధానోపాధ్యాయులకు సమాచారాన్ని అందజేశారు.
News February 13, 2026
ఉట్నూర్: 4KGల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

నమ్మదగిన సమాచారంతో ఇంద్రవెల్లి పోలీసులు శ్మశానవాటిక వద్ద నిఘా ఉంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కొడప రమేష్, కుంర గంగారం, కుముర కృష్ణల వద్ద నుంచి 4కిలోల గంజాయి, మోటార్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను ఉట్నూర్ కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ సాయన్న వెల్లడించారు.
News February 13, 2026
చిన్నకోడూర్ మండలంలో పెద్దపులి సంచారం !

కోహెడ మండలంలో ఇటీవల పశువుల పై పెద్దపులి దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం చిన్నకోడూర్ మండలం చౌడారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందనే సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని పులి పాద ముద్రలను నిర్ధారించారు. పులి ఆచూకీ కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.


