News November 19, 2025
WGL: విద్యుత్ సమస్యలా..? వాట్సాప్ చేయండి!

విద్యుత్ సమస్యపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదా..? చాలా సింపుల్. TG NPDCL వాట్సాప్ నంబరుకు మీ సమస్యను పంపించండి. సమస్య పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు చేపడతారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి విద్యుత్ శాఖ 79016 28348 అనే వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేసి విద్యుత్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు.
Similar News
News January 23, 2026
గుంటూరు: ‘వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం’

గుంటూరు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో UPHCలు, PHCలలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్లు DMHO విజయలక్ష్మి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డీఈఓ, ఎఫ్‌ఎన్‌వో, శానిటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫారములు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలు www.guntur.ap.gov.inలో అందుబాటులో ఉన్నాయి.
News January 23, 2026
నేటి నుంచి తిరుపతిలో టోకెన్ల్ బంద్

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు చేయనున్నారు. ఈక్రమంలో మూడురోజులు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఈనెల 23, 24, 25వ తేదీల్లో ఈ టికెట్లు జారీ చేయరు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను ఇస్తారు. ఈ మేరకు ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.
News January 23, 2026
నేడే సెకండ్ T20.. అక్షర్ పటేల్, బుమ్రా దూరం!

నేడు రాయ్‌పూర్ వేదికగా IND-NZ మధ్య రెండో T20 జరగనుంది. తొలి మ్యాచ్‌లో గాయపడిన అక్షర్ పటేల్ ఇవాళ ఆడే పరిస్థితి కనిపించట్లేదు. అతని స్థానంలో కుల్దీప్ ఆడే ఛాన్సుంది. మరోవైపు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్‌లో భాగంగా బుమ్రాకి రెస్ట్ ఇచ్చి హర్షిత్‌కు అవకాశమివ్వొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అతనొస్తే బ్యాటింగ్ పరంగానూ కొంత బలం పెరుగుతుంది అంటున్నారు. రా.7గం.కు స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.


