News November 19, 2025
WGL: విద్యుత్ సమస్యలా..? వాట్సాప్ చేయండి!

విద్యుత్ సమస్యపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదా..? చాలా సింపుల్. TG NPDCL వాట్సాప్ నంబరుకు మీ సమస్యను పంపించండి. సమస్య పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు చేపడతారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి విద్యుత్ శాఖ 79016 28348 అనే వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేసి విద్యుత్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు.
Similar News
News January 23, 2026
SRPT: తండా నుంచి IAS దాకా.. సక్సెస్ అంటే ఇది

చదువు కోసం రోజుకు 4 కి.మీ. కాలినడకన పుస్తకాలను మోసుకెళ్లిన ఆ గిరిజన బిడ్డ నేడు IAS అధికారిగా ఎదిగి ఆదర్శంగా నిలిచారు. నూతనకల్ మండలం సోమ్లా తండాకు చెందిన గుగులోత్ లింగా నాయక్ ప్రభుత్వ విద్యనభ్యసించి MRO, RDO, Addl కలెక్టర్ వంటి హోదాల్లో రాణించారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఉన్నారు. బుధవారం ప్రభుత్వం ప్రకటించిన IAS జాబితాలో లింగా నాయక్‌కు చోటు దక్కడంతో తండాలో పండుగ వాతావరణం నెలకొంది.
News January 23, 2026
జేడ్ రోలర్‌తో మెరిసే చర్మం

అలసిన ముఖానికి సాంత్వన కలిగించే అద్భుతమైన పరికరం జేడ్ రోలర్. ముఖాన్ని శుభ్రం చేసి రోజ్‌వాటర్ అద్దాలి. తర్వాత జేడ్ రోలర్‌తో సవ్య, అపసవ్య దిశల్లో మసాజ్ చేయాలి. రోజుకి మూడుసార్లు మసాజ్ చేస్తే చర్మంపై లింఫాటిక్ ఫ్లూయిడ్ విడుదల తగ్గుతుంది. మసాజ్ చేయడంవల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ జరిగి, ఆక్సిజన్ అంది చర్మం కాంతివంతం అవుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గి, చర్మం తాజాగా ఉంటుంది.
News January 23, 2026
ఏ శుభకార్యానికైనా నేడు ఉత్తమ దినం!

నేడు వసంత పంచమి. చదువుల తల్లిని కొలిచే పవిత్రమైన రోజు. ఇది అక్షరాభ్యాసాలకే కాకుండా వివాహం, అన్నప్రాశన, గృహప్రవేశం వంటి ఎన్నో శుభకార్యాలకు ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినాన చేసే ఏ కొత్త పనికైనా దైవబలం తోడై విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేడు ఏ రంగు దుస్తులు ధరిస్తే, వేటిని పూజిస్తే సరస్వతీ దేవి కటాక్షంతో నైపుణ్యాలు పెరుగుతాయో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


