News November 19, 2025

WGL: విద్యుత్ సమస్యలా..? వాట్సాప్ చేయండి!

image

విద్యుత్ సమస్యపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదా..? చాలా సింపుల్. TG NPDCL వాట్సాప్ నంబరుకు మీ సమస్యను పంపించండి. సమస్య పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు చేపడతారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి విద్యుత్ శాఖ 79016 28348 అనే వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేసి విద్యుత్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు.

Similar News

News January 21, 2026

శంబర జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు

image

శంబర పోలమాంబ జాతర సందర్భంగా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి బుధవారం అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. ముందుగా పోలమాంబను దర్శించుకున్నారు. అనంతరం పోలీసు అధికారులుతో, దేవదాయ, ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. విధి నిర్వహణలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దిశా నిర్దేశం చేశారు. క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు నిశితంగా పరిశీలించి, పటిష్ఠంగా ఏర్పాట్లు చేయాలన్నారు.

News January 21, 2026

నెల్లూరులో ఎర్రబంగారం పట్టుబడేది కొంచెమేనా..?

image

నెల్లూరు జిల్లాలో అపారమైన ఎర్ర చందనం ఉంది. అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఎర్ర బంగారాన్ని జిల్లా దాటిచేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం.. 2022 నుంచి 2025 వరకు 29,851 కేజీల దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.2.78 కోట్లగా ఉంది. తాజాగా ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఏది ఏమైనప్పటికీ పట్టుబడిన ఎర్రచందనం కంటే ఐదారు రెట్లు దేశం దాటిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి.

News January 21, 2026

ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

image

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ పరీక్షల కోసం 5నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఏదైనా డిగ్రీతో కుటుంబ ఆదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారు అర్హులు. దరఖాస్తులు ఈనెల 30 వరకు http://tsstudycircle.co.in ద్వారా స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 8న నిర్వహించనున్నారు.