News March 26, 2024

WGL: హోలీ పండుగ మిగిల్చిన విషాదం.. ఏడుగురు మృతి

image

హోలీ ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. వెంకటాపురం మండలంలో స్నేహితులిద్దరు కాల్వలో స్నానం చేసి బైక్‌పై వస్తూ చెట్టును ఢీకొని మృతిచెందారు. హసన్‌పర్తి మం.లో పలివేల్పుల, గుండ్లసింగారం సమీపంలో SRSP కాల్వలో స్నానాలకు వెళ్లిన ముగ్గురు గల్లంతు కాగా వారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. నర్సింహులపేట మం.లో చెరువులోకి ఈతకెళ్లిన బాలుడు మునిగి చనిపోయాడు.

Similar News

News February 9, 2026

పీఎంశ్రీ పాఠశాలలపై వరంగల్ కలెక్టర్ సమీక్ష

image

పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన విద్యాలయాల పనితీరుపై వరంగల్ కలెక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 16 పాఠశాలలు ఈ పథకం కింద కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాలు, నిర్వహణ తీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ పాఠశాలల్లో విజ్ఞాన విహార యాత్రలు, యోగా శిక్షణ తరగతులు, సైన్స్ ఫెయిర్‌లు తదితర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.

News February 9, 2026

వరంగల్: ‘ఈనెల 11న వేతనంతో కూడిన సెలవు’

image

ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించినట్లు ఆమె వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాల విద్యా సంస్థలకు ఈనెల 10, 11వ తేదీల్లో, 13వ తేదీ ఓట్ల లెక్కింపు రోజు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

News February 9, 2026

పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో మద్యం దుకాణాల మూసివేత: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు.