News November 12, 2025
WGL: ఒక్క వరదకు రూ.5 కోట్లు వాగులో కొట్టుకుపోయే..!

జిల్లాలోని పర్వతగిరి మండలంలో ఆకేరు వాగుపై రూ.5.57 కోట్లు ఖర్చుతో చెక్‌డ్యామ్ కింద సీసీ రోడ్డు నిర్మించారు. 2024లో పూర్తి చేసిన రహదారి మొన్నటి వర్షాలతో వాగులో కొట్టుకుపోయింది. ఆదిత్య ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ నిర్మించిన ఈ పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నాబార్డ్ ద్వారా రూ.3.02 కోట్లు రుణం, మిగతాది ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారి ఇప్పుడు రైతులకు తలనొప్పిగా మారింది.
Similar News
News November 12, 2025
HYD: ఏడాదికి 20 వేలకు పైగా క్యాన్సర్ కేసులు..!

HYDలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రికి ప్రతి సంవత్సరం సుమారు 20,000 మంది కొత్త క్యాన్సర్ బాధితులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఈ ప్రభుత్వ వైద్య కేంద్రానికి వస్తున్నారు. ఆసుపత్రిలో ఉచితంగా కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక విభాగాలు, పాలియేటివ్ కేర్ యూనిట్లు కూడా ఉన్నాయి.

సిద్దిపేట: యువ వ్యాపారవేత్త సూసైడ్

అప్పుల భారాన్ని తట్టుకోలేక యువ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని మోతేలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రాజు (35) జీవనోపాధి కోసం దుబ్బాకలో బ్యాంగిల్ స్టోర్ నడుపుతున్నాడు. భార్య, ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. మంగళవారం మోతే గ్రామంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.