News February 16, 2025

WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

image

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

Similar News

News March 14, 2026

సిరిసిల్ల: ‘మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలి’

image

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. సిరిసిల్లలోని నెహ్రూ నగర్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిరంతరం మహిళా హక్కుల కోసం పోరాడుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంలో మహిళలందరూ సభ్యులుగా చేరాలన్నారు. దేశంలో గంటకు ఇద్దరు మహిళపై లైంగిక దాడులు జరుగుతుందన్నారు.

News March 14, 2026

నంద్యాల: అప్పటిలా వెంటనే అందడం లేదు!

image

జిల్లాలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. బుక్ చేసుకున్న 5-7 రోజులకు డెలివరీ ఇస్తున్నారు. సిలిండర్ ధరతో పాటు డెలివరీ ఛార్జీ పేరుతో రూ.1,040 నుంచి రూ.1,050 వరకు తీసుకుంటున్నట్లు పలు గ్రామాల ప్రజలు చెప్తున్నారు. గతంలో బుక్ చేసుకున్న వెంటనే సిలిండర్లు వచ్చేవని, ప్రస్తుతం 5 నుంచి వారం రోజులు పడుతోందని వాపోతున్నారు. ఇదే అదనుగా కొందరు బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

News March 14, 2026

భద్రాద్రి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలో ప్రస్తుతం 26 గ్యాస్ పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అందులో HPCL14, BPCL5, IOCL7 గ్యాస్ పంపిణీ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. మొత్తం 4,69,075 గ్యాస్ కనెక్షన్లు ఉండగా వాటిలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 2,41,175, డబుల్ సిలిండర్ 98,868, దీపం 53,405, సీఎస్ఆర్ కనెక్షన్లు 2,465, ప్రధాన పీఎంయూవై కనెక్షన్లు 73,162 ఉన్నాయన్నారు. గ్యాస్ కొరత లేదని తెలిపారు