News April 29, 2024

WGL: ‘6గురు నామినేషన్ ఉపసంహరణ’

image

వరంగల్ 15 పార్లమెంటు నియోజకవర్గం స్థానానికి నామినేషన్ వేసిన అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం 03.00 గంటల వరకు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారని వరంగల్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి పి. ప్రావీణ్య ప్రకటించారు. ఇందులో 1. ఇల్లందుల శోభన్ బాబు, 2. కుమ్మరి కన్నయ్య, 3. బాబు బర్ల, 4. మార్గ రాజభద్రయ్య, 5. డాక్టర్ విజయ్ కుమార్, 6. వేణు ఇసంపెల్లి అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారని అన్నారు.

Similar News

News November 4, 2024

కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టు అంచనా రూ.680 కోట్లకు పెరిగింది: కిషన్ రెడ్డి

image

కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.680 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం రైల్వే అధికారులతో చర్చించిన అనంతరం మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. సోమవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో ఏటా దాదాపు 600ల రైల్వే కోచ్‌లు తయారవుతాయని వెల్లడించారు.

News November 4, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు  

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు రూ.16,700 ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ మిర్చికి రూ. 14,500 ధర పలికింది. మరోవైపు 341 రకం మిర్చి క్వింటాకు రూ.15 వేల ధర వచ్చిందని అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News November 4, 2024

WGL: ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఎంతంటే..?

image

నాలుగు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ నేడు పునఃప్రారంభమైంది. దీంతో పత్తి తరలి వచ్చింది. అయితే గతవారంతో పోలిస్తే నేడు ధర తగ్గింది. గతవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,960 పలకగా.. నేడు రూ.6,910కి పడిపోయింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ధర తగ్గడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.