News March 31, 2024

వామ్మో.. ఉబర్ ప్రయాణికుడికి రూ.7.6 కోట్ల బిల్

image

ఉబర్ ఛార్జీ చూసి ప్రయాణికుడి గుండె గుభేల్‌మంది. ఉబర్ ఆటోలో ప్రయాణించిన అతడికి ఏకంగా ₹7.6 కోట్ల ఛార్జీ చూపించింది. నోయిడాకు చెందిన దీపక్ ఆఫీస్‌కు వెళ్లేందుకు ఉబర్ ఆటో బుక్ చేసుకున్నారు. మొదట ఛార్జీ ₹62 చూపించగా.. ట్రిప్ పూర్తయ్యేసరికి రూ.7,66,83,762లు చూపించింది. దీంతో షాక్‌కు గురైన దీపక్ ఈ విషయాన్ని నెట్టింట పోస్ట్ చేశారు. టెక్నికల్ ఇష్యూతోనే ఇలా జరిగిందని ప్రయాణికుడికి ఉబర్ క్షమాపణలు చెప్పింది.

Similar News

News February 18, 2026

నాకు క్లీన్ చిట్ వచ్చింది.. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’పై ట్రంప్

image

లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయంలో నేను రహస్యంగా దాచుకోవడానికి ఏమీ లేదు. నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. కోర్టు కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చింది’ అని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఎప్‌స్టీన్ తనకు వ్యతిరేకంగా పని చేసినట్లు ఆరోపించారు.

News February 18, 2026

జపం ఎక్కడ చేస్తే ఉత్తమ ఫలితాలు?

image

జపం చేసే స్థలం, ఆసనాన్ని బట్టి ఫలితం మారుతుందని శాస్త్ర వచనం. వాటి ప్రకారం.. ఉన్ని వస్త్రంపై జపం వంశవృద్ధిని, పర్వత శిఖరంపై జపం తపస్సిద్ధిని కలిగిస్తాయి. ఇంట్లో చేసే జపం సాధారణ ఫలితం, నదీ తీరంలో చేస్తే అంతకన్నా 2 రెట్లు, గోశాలలో 100 రెట్లు పుణ్యం లభిస్తుంది. తిరుమల, కాశీ, శ్రీశైలం వంటి స్వయంభూ క్షేత్రాల్లో చేసే జపానికి కోటి రెట్ల ఫలితం ఉంటుంది. సూర్యుడు, గురువు, దీపానికి అభిముఖంగా జపం చేయాలి.

News February 18, 2026

సోనియా నన్ను CM చేయాలనుకున్నారు.. కానీ: హిమంత

image

2014లో తనను అస్సాం CM చేయాలని నాటి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అనుకున్నారని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. కానీ రాహుల్ వల్ల మొత్తం మారిపోయిందన్నారు. ‘తేదీ నిర్ణయించుకోమని మేడమ్(సోనియా) చెప్పారు. జూన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తానన్నా. USలో ఉన్న రాహుల్ పార్టీ నాయకులతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత పరిస్థితి మారిపోయింది’ అని ఆరోపించారు. 2015 ఆగస్టులో కాంగ్రెస్ నుంచి BJPలోకి ఆయన చేరారు. 2021లో CM అయ్యారు.